సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

"ప్రకృతిని కాపాడుదాం" - "పరమాత్మ అనుగ్రహం పొందుదాం" "అదృష్ట వృక్షములు"

వర్షఋతువు పూర్తి అయ్యే ౧౫ రోజుల ముందునుండీ రెండునెలల కాలము "యమదంష్ట్ర కాలం" (రోగవృద్ధి కాలం) అని అంటారు.
ఇట్టి సమయమందు వారి వారి జన్మనక్షత్రముల రీత్యా అదృష్ట వృక్షములను నాటినా, పెంచినా, ఆరాధించినా తద్దోషములు తొలగి సర్వులూ & సమాజమూ రోగబాధలు లేక సుభిక్షముగా ఉండునని శాస్త్రవచనం. (అందుకే వర్షఋతువులో వచ్చే విఘ్నేశ్వర స్వామి పూజలో అనేక వృక్షజాతుల దళములతో, ఫలములతో ఆరాధించడము అనాదిగా జరుగుతున్నది).
జన్మ నక్షత్రములు తెలిసినవారు జన్మ నక్షత్రముల రీత్యా లేదా పిలిచే పేరులోని మొదటి అక్షరముల రీత్యా అదృష్టవృక్షములను నాటండి ప్రకృతి అనుగ్రహం పొందండి.
"ప్రకృతియే పరమాత్మ"
"ప్రకృతిని కాపాడుదాం" - "పరమాత్మ అనుగ్రహం పొందుదాం"
॥లోకాస్సమస్తా స్సుఖినోభవంతు॥
(విష్ణు & అగ్ని పురాణం)
యల్.యస్.సిద్ధాన్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి