సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

9, మే 2014, శుక్రవారం

శ్రీ రామ చంద్ర స్వామి వారి జాతక చక్రం & జన్మ సమయ వివరములు

శ్రీరామ చంద్ర స్వామి వారి జన్మ జాతక చక్రం విశేష వివరములు
౧౬౨౬ వ సంవత్సర తాళపత్ర ప్రతి నుండి సేకరణ

కృతేతు మానవా ధర్మాః త్రేతాయాం గౌతమ స్మృతాః ।
ద్వాపరే శంఖలిఖితాః కలౌ పారాశరాః స్మృతాః ॥

కృత యుగము లో మను ధర్మ శాస్త్రం
త్రేతా యుగము లో గౌతమ ధర్మ శాస్త్రం
ద్వాపర యుగము లో శంఖలిఖిత ధర్మ శాస్త్రం
కలి యుగము లో పరాశర ధర్మ శాస్త్రం అనుసరించి నియమములు పాటించవలెను అని శ్శాస్త్రవచనం
"కలియుగ ధర్మాలతో త్రేతాయుగ ధర్మాలను కంపేర్ చేయకూదదండి"
ఆశ్వమేధ యాగం త్రేతాయుగములో ద్వాపరయుగము లో చేయమని ఆ ధర్మ శ్శాస్త్రములు చెబుతుంటే కలియుగము లో నిషిద్ధమని పరాశర స్మృతి చెబుతున్నది.
త్రేతాయుగములో గౌతమ ధర్మశ్శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులకు ౫ వత్సరములకు, క్షత్రియులకు ౮ వత్సరములకు ఉపనయనము చేయమని శ్శాస్త్రవచనం
కలియుగములో పరాశర ధర్మశ్శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులకు ౮ వత్సరములకు, క్షత్రియులకు ౧౧ వత్సరములకు ఉపనయనము చేయమని శ్శాస్త్రవచనం
ఇలాంటివి చాలా ఉన్నాయి
వేటికవే ఆ కాలానికి ప్రామనిక గ్రంధములు_గమనించగలరు.
మీ
యల్.యస్.సిద్ధాన్తి
౯౯౬౩౭౩౨౩౦౩


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి